Panjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లో అగ్నిప్రమాదం..
- By Sudheer Published Date - 11:21 AM, Fri - 22 December 23

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట (Panjagutta ) ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ కాపాడారు. అక్కడ ఉన్న డంబెల్ సహాయంతో డోరును బద్దలు కొట్టి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పలు కెమికల్ ఫ్యాక్టరీ లలోనే కాకుండా పలు గోదాం లలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణ నష్టం తో పాటు కోట్లాది ఆస్థి నష్టం కూడా వాటిల్లింది.
Read Also : Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!