Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
Padi Kaushik Reddy : క్వారీ యజమానిని బెదిరించడం, దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది
- By Sudheer Published Date - 06:14 AM, Sat - 21 June 25

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు నమోదు నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం వరంగల్‌కు తరలించారు.
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు అయ్యింది. క్వారీ యజమానిని బెదిరించడం, దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అధికారులు బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 308(2), 308(4), 352ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్లు తీవ్ర ఆరోపణలకు సంబంధించినవిగా భావించబడతాయి. ఈ అంశంపై ఇంకా పోలీసులు పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది.
lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?
కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. ముఖ్యంగా ఎన్నికల తరువాత ప్రతిపక్ష నాయకులపై టార్గెట్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీలు దీనిపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తుండగా, బీఆర్ఎస్ నేతలు స్పందనకు దూరంగా ఉన్నారు. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, రాజకీయ పరంగా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై అందరి దృష్టి మళ్లింది.