Nilam Madhu : బిఆర్ఎస్ కు మరో షాక్..నీలం మధు రాజీనామా
బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే.. సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే మరో సారి టికెట్ దక్కడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు
- By Sudheer Published Date - 03:22 PM, Mon - 16 October 23

బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మరోనేత పార్టీకి రాజీనామా చేసారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ లో ఎన్నికలు (Telangana Elections) రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మొదటి నుండి గెలుపు ఫై ధీమాగా ఉన్న బిఆర్ఎస్ (BRS) అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి బిఆర్ఎస్ టికెట్ వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్న వారికీ కేసీఆర్ మొండిచెయ్యి చూపించడంతో వారంతా పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా..తాజాగా మరో నేత బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు.
పటాన్ చెరు టికెట్ కోసం నిన్నటి వరకు వేచి చూసిన నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu) ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు (Patancheru Constituency) ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే.. సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే మరో సారి టికెట్ దక్కడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకుని తనకే బీఫామ్ ఇస్తారని ఆయన ఆశించారు. అయితే.. నిన్న మహిపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ పార్టీ బీఫామ్ అందించారు. దీంతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నీలం మధు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి సైనికుడిలా సేవలందించానని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పటాన్ చెరు జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో తాను పోటీ చేశానని గుర్తు చేశారు. ఆది నుంచి అహర్నిశలు పార్టీ కోసమే ఓ సైనికుడిలా కష్టపడి పని చేశానని, అయినా పార్టీ తన సేవలను గుర్తించలేదని నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. సోమవారం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే వేదిక నుంచి పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం పూరించారు. అశేష సబండవర్గాల ప్రజలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అభిమానుల సమక్షంలో కార్యాచరణ ప్రకటించారు. నీలం మధు ముదిరాజ్ ప్రకటన చేయబోతున్నాడు అన్న విషయం తెలుసుకున్న ముదిరాజ్ సంఘాల నాయకులు సభ్యులు ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపల్లి గ్రామానికి తండోపతండలుగా తరలివచ్చారు. నీలం మధు ముదిరాజుకు జనం నీరాజనాలు పట్టారు.
Read Also : Gajwel Battle: గజ్వేల్‌లో ఈటెల వర్సెస్ కేసీఆర్ మినీ యుద్ధం