Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄New Rule On Joining Telangana Congress

T-Congress: కాంగ్రెస్‌లో చేరికలపై కొత్త రూల్!

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

  • By Balu J Published Date - 02:31 PM, Sat - 23 July 22
T-Congress: కాంగ్రెస్‌లో చేరికలపై కొత్త రూల్!

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. CLP నేత భట్టి విక్రమార్కతో మొదలైన పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. భట్టిని ఢిల్లీకి పిలిచి చర్చించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదులు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేరికల సమాచారం తనకు లేదని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. యాష్కీతో పాటు… దామోదర రాజనర్సింహ… లాంటి నేతల నుంచి ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డీ చేరిక తో కొందరు నేతలు మళ్లీ కంప్లయింట్‌ చేశారు. మెట్ పల్లి zptc చేరికలపై మధుయాష్కీకి, ఖమ్మం జిల్లా చేరికపై భట్టికి, దేవరకొండ చేరికలపై ఉత్తమ్ కి, మెదక్ చేరికపై దామోదర రాజనర్సింహకి సమాచారం లేదని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయట.

వరసగా ఫిర్యాదులు రావడంతో.. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అధిష్ఠానం. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి .. ఆ జిల్లా నేతలకు సమాచారం లేకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని అధిష్ఠానానికి ఫిర్యాదు వెళ్తున్న తరుణంలో AICC కొంత స్పష్టత ఇచ్చింది. చేరికలపై ఢిల్లీ పెద్దలకు రేవంత్‌రెడ్డి చెబుతున్నా.. స్థానిక నాయకత్వానికి ఆ సమాచారం వెళ్లడం లేదనేది ప్రధాన అభ్యంతరం. అందుకే సమస్యను కొలిక్కి తెచ్చింది. ఇకపై పార్టీలో ఎవరు చేరుతున్నా.. 48 గంటల ముందు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారట. బోసురాజు ఆ తర్వాత సంబంధిత జిల్లా నేతలకు.. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఇలాంటి సమస్యలు వస్తాయనే కాంగ్రెస్‌లో చేరికల కమిటీ వేశారు. దానికి మాజీ మంత్రి జానారెడ్డి ఛైర్మన్‌. ఆ కమిటీ ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన చేరికలు ఏవీ అక్కడ చర్చించిన ధాఖలాలు లేవు. నామ్‌ కే వాస్తేగా మారిపోయింది చేరికల కమిటీ. ముందుగా సమాచారం లీకైతే.. చేరేవారు జారిపోతారనే ఆందోళన రేవంత్ శిబిరంలో ఉంది. దానికి మిగతా సీనియర్లు ఒప్పుకోవడం లేదు. సమిస్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఏకపక్ష చర్యలను స్వాగతించలేమని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ చేరికలు ఎందుకు లేవు.. అభ్యంతరాలు చేప్పే నాయకులకు వచ్చే నష్టం ఏంటి? ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి చేరింది ఇద్దరే అయినా.. వాటిపై జిల్లా నాయకులతో చెప్పామన్నది పీసీసీ చీఫ్‌ వర్గం వాదన. అధిష్ఠానం మాత్రం 48 గంటల ముందుగా సమాచారం అనే నిబంధన పెట్టింది. మరి ఈ రూల్‌ వర్కవుట్‌ అవుతుందో లేక.. చేరికల కమిటీ మాదిరే దానిని పక్కన పడేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే రేవంత్‌ టీమ్‌పై పైచెయ్యి సాధించామనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారట. మరి.. ఇకపై చేరికల విషయంలో ఎలాంటి గొడవలు తెరపైకి వస్తాయో చూడాలి.

Tags  

  • batti vikramarka
  • new rule
  • PCC Chief revanth reddy
  • TCongress

Related News

Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

టీక్రాంగెస్ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిపోయిన విషయం తెలిసిందే.

  • Komatireddy On Revanth: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే!

    Komatireddy On Revanth: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే!

  • TCongress Action Plan: టీకాంగ్రెస్ ‘మునుగోడు’ ఆపరేషన్ షురూ!

    TCongress Action Plan: టీకాంగ్రెస్ ‘మునుగోడు’ ఆపరేషన్ షురూ!

  • Munugodu Elections : మునుగోడులో `సామాజిక` ముస‌లం

    Munugodu Elections : మునుగోడులో `సామాజిక` ముస‌లం

  • Where Is Jagga Reddy? ‘కాంగ్రెస్ కల్లోలంపై’ జగ్గారెడ్డి మౌనం

    Where Is Jagga Reddy? ‘కాంగ్రెస్ కల్లోలంపై’ జగ్గారెడ్డి మౌనం

Latest News

  • Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

  • 5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

  • Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!

  • Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

  • Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

Trending

    • Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

    • Donald Trump : ట్రంప్ పై `గూఢ‌చ‌ర్య` ఉల్లంఘ‌న కేసు

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: