Prakash Raj: కేసీఆర్ వదిలిన బాణం
దేశ రాజకీయాల ప్రస్తావన కేసీఆర్ చేసిన ప్రతి సందర్భంలోనూ నటుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అడుగులు వేసినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. కర్ణాటక వెళ్ళినప్పుడు కేసీఆర్ వెంట ఆనాడు ప్రకాష్ రాజ్ నడిచాడు.
- By CS Rao Published Date - 09:09 PM, Sun - 20 February 22

దేశ రాజకీయాల ప్రస్తావన కేసీఆర్ చేసిన ప్రతి సందర్భంలోనూ నటుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అడుగులు వేసినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. కర్ణాటక వెళ్ళినప్పుడు కేసీఆర్ వెంట ఆనాడు ప్రకాష్ రాజ్ నడిచాడు. తెలంగాణ పరిపాలన పైన, కేసీఆర్ ఆలోచనకు చాలాసార్లు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ మద్దతుగా మీడియాలో ప్రచారం చేసాడు. ఇంతకు వాళ్లిద్దరి మధ్య ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
తెలంగాణ సీఎం కేసీఆర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇద్దరికీ మోడీ అంటే పడటం లేదు. ఆయన పాలసీలపై ఎప్పటికప్పుడు ప్రకాష్ వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తుంటాడు. మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా మహారాష్ట్ర పర్యటనలో ఎవ్వరూ ఊహించని వ్యక్తి తారసపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి ఎయిర్ పోర్టులో దిగగానే ఆయనకు ప్రకాష్ రాజ్ స్వాగతం పలికడం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
బీజేపీకి ప్రత్యామ్మాయంగా జాతీయస్థాయిలో ఒక కూటమి ఏర్పాటులో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చించేందుకు ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్రయంలో అనూహ్య రీతిలో కేసీఆర్ బృందానికి ప్రకాష్ రాజ్ స్వాగతం పలకడం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రకాష్ రాజ్ స్వాగతానికి ఫిదా అయిన కేసీఆర్ తన వెంట వచ్చిన ఎంపీలు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ నేతలను ప్రకాష్ రాజ్ కు పరిచయం చేయటం స్పెషల్ అట్రాక్షన్. ఇక కేసీఆర్ బృందం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికార నివాసానికి ప్రకాష్ రాజ్ తో కలసి చేరుకుంది. లంచ్ అనంతరం ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. ఈ అన్నింట్లోనూ ప్రకాష్ రాజ్ పాల్గొనడం విశేషం.
ఆయన కర్ణాటక నగరంలో బీజేపీపై పోటీగా ఎంపీగా నిలబడ్డారు. ఇక మోడీ విధానాలను ట్వీట్ల రూపంలో ఎండగడుతూ విమర్శిస్తుంటారు.
ఇటీవల ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ .. మంచు విష్ణు ప్యానెల్ చేతిలో ఓడిపోయింది. అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా రాజ్ కనిపించడం లేదు. సడెన్ గా కేసీఆర్ తోపాటు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా సామాజిక మేధావులతో కేసీఆర్ ఏదో ఒక అంశంపై చర్చించడానికి ఇష్టపడతాడు. ఆ కోవకు చెందిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ ప్రసంగాలు ఉంటాయి. అందుకే ఆయన భావజాలాన్ని కేసీఆర్ ఇష్టపడ్డారట. రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య రాజకీయ బంధం టాలీవుడ్ పై పడే అవకాశం లేకపోలేదు. సినీ పరిశ్రమపై ఆంధ్ర ఆధిపత్యంపై
కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రకాష్ రాజ్ ను ఫోకస్ చేస్తున్నాడని టాక్ ఉంది. పైగా కేసీఆర్ కోటరీలో మనిషిగా ప్రకాష్ మారాడు. అటు రాజకీయం ఇటు సినీ పరిశ్రమపై ప్రకాష్ రాజ్ రూపంలో కేసీఆర్ ముద్ర పడనుంది.!
Actor-politician #PrakashRaj was also seen at #CMKCR's meeting with #Maharashtra CM in #Mumbai pic.twitter.com/c4RThoKNod
— Sudhakar Udumula (@sudhakarudumula) February 20, 2022