New National Highway : తెలంగాణలో కొత్తగా నేషనల్ హైవే..?
New National Highway : తాజాగా చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్న సిరిసిల్ల వరకు కొత్త నేషనల్ హైవే (New National Highway) నిర్మాణంపై చర్చలు
- By Sudheer Published Date - 01:12 PM, Thu - 23 January 25

తెలంగాణలో రహదారుల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ మధ్య ఉన్న రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇదిలా ఉండగా మరో గుడ్ న్యూస్ ను ఎంపీ రఘునందన్ (MP Raghunandan rao ) తెలిపి రాష్ట్ర ప్రజల్లో సంతోషం నింపారు.
Republic Day 2025 : గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం
తాజాగా చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్న సిరిసిల్ల వరకు కొత్త నేషనల్ హైవే (New National Highway) నిర్మాణంపై చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ హైవే నిర్మాణం కోసం స్థానికులు గతకొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలకు వినతులు సమర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంపై స్పందించారు. నేషనల్ హైవే నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఎంపీకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ హైవే నిర్మాణం వేములవాడ వంటి ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రానికి చేరువైన ప్రాంతాలకు ప్రయాణం సులభతరం చేస్తుందని వారు తెలిపారు. వేములవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణ దూరం కూడా తగ్గుతుందని తెలుపగా ప్రజలఅభిప్రాయాలను పాజిటివ్‌గా ఎంపీ స్వీకరించారు. దీనిపై త్వరలోనే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ హైవే నిర్మాణం గురించి చర్చించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఆయన హామీ స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది.