BJP Strengthening: తెలంగాణపై ‘బీజేపీ’ నజర్!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలంచేకూర్చాయి. అటు దేశంలో మోడీ, ఇటు యూపీలో యోగీకి చెక్ పెట్టాలని భావించిన ప్రతిపక్షాలకు తీవ్ర నిరాశే మిగిలింది.
- By Balu J Published Date - 12:13 PM, Fri - 18 March 22

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలంచేకూర్చాయి. అటు దేశంలో మోడీ, ఇటు యూపీలో యోగీకి చెక్ పెట్టాలని భావించిన ప్రతిపక్షాలకు తీవ్ర నిరాశే మిగిలింది. సెమీ ఫైనల్స్ గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీకి కనీస పోటీ ఇవ్వకపోగా, ఉనికిని సైతం కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. కాంగ్రెస్, సమాజ్ వాది, ఎంఐఎం పార్టీలు మోడీ, యోగి మేనియా అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు ఊవిళ్లురుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కమలం గురి పెట్టే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ ఫ్రడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకోవడం, కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తుండటం బీజేపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. రీ సెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు వేయడం కూడా పార్టీ అధిష్టానం సీరియస్ గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై గురి పెట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు బీజేపీ ఎమ్మెల్యే రాటల రాజేందర్ వ్యాఖ్యలు కూడా మరింతబలమిస్తున్నాయి. బీజేపీకి దక్షిణ భారతానికి తెలంగాణ గేట్‌వే అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన ప్రజాసౌమ్య పరిరక్షణ దీక్ష సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీకి చెందిన జాతీయ నాయకులు తెలంగాణలో ఎన్నికల గెలుపుపై పూర్తి దృష్టి సారించారన్నారు. భవిష్యత్తు మనదేనని, మనల్ని ఎవరూ అడ్డుకోలేరని, పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎం రఘునందన్ రావు, టి రాజా సింగ్‌లతో పాటు తన సస్పెన్షన్‌ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నిబంధనలను అనుసరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న పరిస్థితులపై తమ గ్రామాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోడీతో భేటీ కావడం, సింగరేణి అవినీతి, ఇతర సమస్యలను వివరించారు. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనాయకత్వం సరైన సమయంలో తెలంగాణలో రంగంలోకి దిగేందుకు సమయాత్తమవుతోంది.