YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు
వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి హైకోర్టు సమన్లు జారీ చేసింది. వెంటనే కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
- By Praveen Aluthuru Published Date - 01:10 PM, Mon - 5 June 23

YS Sharmila: వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి హైకోర్టు సమన్లు జారీ చేసింది. వెంటనే కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పేపర్ లీకేజి విషయంలో వైఎస్ షర్మిల నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు. ఎసై స్థాయి వ్యక్తితో సైతం ఆమె దురుసుగా ప్రవర్తించారని బంజారాహీల్స్ పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నాంపల్లి హైకోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. తాజాగా నాంపల్లి కోర్టు స్పందించింది. ఈ మేరకు ఆమెకు సమన్లు పంపుతూ విచారణకు హాజరుకాల్సిందిగా ఆదేశించింది.
గత కొంతకాలంగా వైఎస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇటీవల తెలంగాణాలో సంచలనం రేపిన పేపర్ లీకేజి అంశంపై వైఎస్ షర్మిల తారాస్థాయిలో ఉద్యమించింది. అనేక పోరాటాలకు, నిరసనలకు, దీక్షలకు ఆమె నాయకత్వం వహించింది.
Read More: Chennai Express: తమళనాడులో రైలు కోచ్‌కు పగుళ్లు.. తప్పిన ప్రమాదం