HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Musi River Re Survey

Hydraa : బఫర్‌జోన్‌ ఎక్కడి వరకు ఉందనేది కూడా అధికారులకు క్లారిటీ లేదు

Hydraa : అసలు మూసీ నదిలో బఫర్‌జోన్‌ ఎక్కడి వరకు ఉందనేది అధికారులు చెప్పడం లేదని.. జస్ట్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మార్క్ వేసుకుంటూ వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు

  • Author : Sudheer Date : 27-09-2024 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musi River Re Survey
Musi River Re Survey

మూసీ నది (Musi ) ప్రక్షాళనను పేరుతో కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt)..మూసీ నిర్వాసితులను ఖాళీ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. మూసీ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు. పునరావాసం కోసం పేదల వివరాల సేకరించే పనిలో భాగంగా అధికారులు మూసి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లారు.

పునరావాసం తర్వాతే ఇళ్ళు కూలుస్తామని… అర్హులైన కుటుంబాలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే అసలు మూసీ నదిలో బఫర్‌జోన్‌ ఎక్కడి వరకు ఉందనేది అధికారులు చెప్పడం లేదని.. జస్ట్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మార్క్ వేసుకుంటూ వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అసలు ఎన్ని రోజుల్లో ఖాళీ చేయాలి..? ఎంత టైం ఇస్తున్నారు..? మా ఇళ్లకు నోటీసులు ఇవే..? నోటీసుల్లో కాస్త టైం ఇస్తారు కదా..? అని ప్రశ్నిస్తే వాటికీ ఇలాంటి సమాదానాలు చెప్పకుండా అధికారులు దాటవేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఏది ఏమైనప్పటికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం..దాన్ని సరైన రీతిలో ఆచరణ చేయడం లేదనేది వాస్తవం. మొదట ప్రభుత్వ స్థలంలో , చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని మాత్రమే కూలుస్తామని..రాజకీయ నేతల ఫామ్ హౌస్ లపైనే దృష్టి అని..వాటి తర్వాతే మిగతావి అని హైడ్రా ముందుగా తెలిపింది. ఆ తర్వాత రాజకీయ నేతల ఫామ్ హౌస్ లు వదిలిపెట్టారు. చెరువులు కబ్జా చేసి విల్లాలు , బిల్డింగ్స్ కట్టిన బిల్డర్స్ ను వదిలిపెట్టి..సామాన్య ప్రజల ఫై ప్రతాపం చూపిస్తున్నారు. అంతే కాదు సంపన్నులు , రాజకీయ నేతల ఇళ్లకు నెల రోజుల టైం ఇస్తున్నారు..సామాన్య ప్రజల ఇంటి దగ్గరికి వచ్చేసరికి బుల్లడోజర్స్ రంగంలోకి దింపుతూ..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకుంటామన్న కూడా జాలి చూపించకుండా కూల్చేస్తు..కట్టుబట్టలతో నడి రోడ్ మీద నిల్చుబెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే..అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త హైడ్రా దూకుడు తగ్గించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సర్కార్ మంచిది..లేదంటే మధ్యంతర ఎన్నికలు రావడం పక్క..ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

Read Also : Dashboard Cameras: డాష్‌ కెమెరా అంటే ఏమిటి? కలిగే ప్రయోజనాలు ఏమిటి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HYDRAA
  • musi

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • High Court takes a serious view of the Owaisi educational institution!

    Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

Latest News

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd