HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Munugode Victory Is A Slap To Delhi Bosses Ktr

KTR: ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన.. మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు : కేటీఆర్‌

ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.

  • Author : Hashtag U Date : 07-11-2022 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నవంబర్‌ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి కేసీఆర్‌ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ధన్యవాదాలు.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన మునుగోడు ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS #MunugodeWithTRS pic.twitter.com/d9yJSQa0Z2

— BRS Party (@BRSparty) November 6, 2022

ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్‌ మీడియా వారియర్స్‌కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి.. పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపునకు చాలా గొప్పగా పని చేసి, తమ కార్యకర్తలు, శ్రేణులను అద్భుతంగా నడిపించిన కీలకపాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అన్నారు.
‘2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఈ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్‌లు నరేంద్ర మోదీ, అమిత్‌షా. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నం. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన మొఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనుకుండి నాటకం మొత్తం నడిపింది అమిత్‌ షా, నరేంద్ర మోదీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు’ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • Munugode
  • munugode win
  • trs

Related News

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd