Viral : ఎంపీ చామల మార్ఫింగ్ వీడియో
Viral : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ను కించపరిచే విధంగా మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు ప్రాథమిక ఫిర్యాదులు చేసింది
- By Sudheer Published Date - 01:20 PM, Sun - 20 April 25

తెలంగాణ(Telangana)లో ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ను కించపరిచే విధంగా మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు ప్రాథమిక ఫిర్యాదులు చేసింది. ఫైనరైస్ పంపిణీపై ఫేక్ వీడియోలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెచ్చిన మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విషయమై TPCC మీడియా కోఆర్డినేటర్ కె. శ్రీకాంత్ యాదవ్ ఫిర్యాదు చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించేలా వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆందోళన కలిగించిందని తెలిపారు. దీనిపై ఏప్రిల్ 17న సంబంధిత వారిపై భారతీయ న్యాయ వ్యవస్థ కొత్త నిబంధనలు అయిన BNS సెక్షన్లు 353(2), 352, 336(4) కింద కేసులు నమోదయ్యాయి.
అదేవిధంగా TPCC సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ సజ్జన్ మరో ఫిర్యాదు చేశారు. @Sarmadevi28 అనే సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ ఫైనరైస్‌ను ప్లాస్టిక్ బియ్యంలా చూపిస్తూ నకిలీ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. స్టవ్ మీద బియ్యం ఉడికిస్తున్నట్టు చూపిస్తూ ప్రజల్లో భయం కలిగించేలా ఆ వీడియోను రూపొందించినట్లు తెలిపారు. దీనిపై కూడా ఏప్రిల్ 16న కేసు నమోదు కాగా, నిందితుల గుర్తింపు కోసం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని సైబర్ క్రైమ్ ACP ఆర్జీ శివమారుతి వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ తరహా బాధ్యతారహిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
సన్న బియ్యం అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్స్ లో జరా పైలం 🙏
గాలిమోటర్ల పోయి నీళ్లు వాటర్ మంత్రి ప్లాస్టిక్ బియ్యం పంపిణి చేసినవి, మిస్టర్ ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు మంత్రి మీ సమాధానం ఏంటి 🤔@UttamINC @KomatireddyKVR pic.twitter.com/zJeQOYdkCt— Devi Sharma 🇮🇳 (@sarmadevi28) April 13, 2025
బ్రేకింగ్ న్యూస్💥
నా గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు, శరం ఉండాలి
మొన్న CLP మీటింగ్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకిన రేవంత్ రెడ్డి.. స్పందించిన ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రజల డబ్బులు అన్ని దులుపుకొని తీసుకొని పోయి జపాన్‌లో పెడుతుండు… pic.twitter.com/9WG6y0oWXm
— DIG TV Parody (@DigtvTelugu) April 17, 2025