MLC Kavitha: మీ టాలెంట్ అద్భుతం.. క్రీడాకారుణిలకు కవిత అభినందనలు
క్రీడారంగంలో రాణిస్తున్న తెలంగాణ అమ్మాయిలను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అభినందించారు.
- By Balu J Published Date - 12:10 PM, Thu - 29 December 22

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్ లు ఎమ్మెల్సీ కవితను కలిశారు. జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుపొందడం, జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరి విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కవిత తెలిపారు.
తెలంగాణ బాక్సర్ (Telangana Boxer), బర్మింగ్ హామ్ కామన్వెల్త్ 2022 క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ (Nikhat zereen) తన పంచ్ పవర్ ఎంటో మరోసారి నిరూపించుకుంది. భోపాల్‌లో జరిగిన నేషనల్ విమెన్స్ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ ప్రత్యర్ధి రైల్వేస్ బాక్సర్ అనామికపై విజయం సాధించింది. కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో స్టార్ బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న నిఖత్ జరీన్ భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది. కన్నతల్లిదండ్రులకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిపెట్టింది.
ఇటీవల జరిగిన రైఫిల్, పిస్టోల్ చాంపియన్ షిప్ పోటీలో ఎన్నో పథకాలు సాధించింది ఇషా సింగ్ (Isha Singh). ఇటీవల జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రశంసలు కురిపించారు.
Met and honoured the Golden Girl of Telangana and India, Boxing Champion @nikhat_zareen
We are so proud of her accomplishments and achievements. Wishing her all the very best for her future endeavours. pic.twitter.com/KMaYhLWtur
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 29, 2022
Also Read: Police Boss: తెలంగాణ పోలీస్ బాస్ ఈయనే?