MLA Vivekananda : నిద్రావస్థలో నుండి బయటకు రండి – కాంగ్రెస్ సర్కార్ కు సలహా
గతంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి మా ప్రభుత్వం కాపాడగలిగిందని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అలాంటి చర్యలే చెప్పటడం లేదని
- By Sudheer Published Date - 11:31 PM, Mon - 29 July 24

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly session 2024) వాడివేడిగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న హరీష్ రావు , నేడు మాజీ మంత్రి జగదీశ్ బడ్జెట్ పద్దుపై ఘాటుగా స్పందించారు. ఇదే క్రమంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA Vivekananda ) సైతం కాంగ్రెస్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదన్నారు. ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ మాత్రం నిద్రావస్థలో ఉందని , గతంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి మా ప్రభుత్వం కాపాడగలిగిందని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అలాంటి చర్యలే చెప్పటడం లేదని.. ప్రస్తుతం 17 ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయని వివేకా తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే నాళాలు ఉప్పొంగి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని.. ఇకనైనా అసలు పనులపై దృష్టి పెట్టండంటూ రేవంత్ రెడ్డి సర్కారుకు చురకలంటించారు.
అలాగే నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పతనవ్యవస్థకు చేరిందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరట కలిగించేలా.. కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని సీఎంకు సూచించారు. దేశంలోనే 50 శాతం ఐటీ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని.. కానీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం పదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ సత్యదూరమైన మాటలు అంటున్నారని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ