MLA Seethakka : రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, క్లారిటీ ఇచ్చిన సీతక్క
రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దనసరి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
- By Hashtag U Published Date - 02:26 PM, Mon - 18 July 22

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దనసరి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని, క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు తనకే లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందన్న సీతక్క.. అందువల్లే తాను కొత్త బ్యాలెట్ పేపర్ అడిగినట్టు వివరణ ఇచ్చారు. అయితే, అందుకు అధికారి అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేసినట్టు చెప్పుకొచ్చారు.