MLA Jeevan Reddy: తెలంగాణ మోడల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన జీవన్ రెడ్డి
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అధికార, విపక్షాలు ముందుకెళ్తున్నాయి
- By Praveen Aluthuru Published Date - 03:05 PM, Thu - 20 April 23

– ఔరంగాబాద్ లో BRS భారీ బహిరంగ సభ
– జిల్లాలో కదిలిన ప్రచార రాధాలు
– ప్రజల్లోకి కేసీఆర్ సంక్షేమ పథకాలు
– వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
MLA Jeevan Reddy: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అధికార, విపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఇక తమ అధికారంలో ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించే కార్యక్రమానికి బీఆర్ఎస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నేతలు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రచార రధాలను సిద్ధం చేశారు స్థానిక నాయకులు.
ఈ నెల 24వ తేదీన ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్)లోని జబిందా మైదానంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భారీ సభను విజయవంతం చేసే పనిని స్థానిక నాయకులు భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా ప్రచార రధాలను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారం తెలంగాణ మోడల్ ను వివరించే వాల్ పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.