Vultures: తెలంగాణకు తరలివస్తోన్న రాబందులు
కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో కనిపించకుండా వలస వెళ్ళిపోయిన రాబందు పక్షులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నుండి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు జంటల పక్షులను గుర్తించినట్లు వాటి కదలికలపై మానిటరింగ్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
- By Siddartha Kallepelly Published Date - 05:11 PM, Mon - 13 December 21

కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో కనిపించకుండా వలస వెళ్ళిపోయిన రాబందు పక్షులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నుండి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు జంటల పక్షులను గుర్తించినట్లు వాటి కదలికలపై మానిటరింగ్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
2014 వరకు పాలరాపుగుట్ట రాబందులకు హోమ్ ప్లేస్ గా ఉండేది. అక్కడ దాదాపు 32 రాబందులు ఉండేవి. గత సంవత్సరంన్నర నుండి మెల్లిమెల్లిగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. మిగతావి మహారాష్ట్ర లోని గడ్చిరోలికి వలసవెళ్లిపోయాయి. అలా వెళ్లిన రాబందులు తిరిగి తెలంగాణలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ కి వస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామలింగం తెలిపారు.
రాబందులను రక్షించడానికి అటవీశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లతో కలిసి ఆ పక్షులున్న ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లి రాబందులను కాపాడాల్సిన అవసరంతో పాటు వాటిని ఎలా సంరక్షించుకోవాలో అనే అంశంపై గ్రామస్థులకు అవగాహనా కల్పిస్తున్నారు.