Miss World 2025 : నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం..సజావుగా సాగేనా..?
Miss World 2025 : గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరుగనున్న ఓపెనింగ్ సెర్మనీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
- By Sudheer Published Date - 10:33 AM, Sat - 10 May 25

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలు నేటి నుంచి హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరుగనున్న ఓపెనింగ్ సెర్మనీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పోటీలు 120 దేశాల నుంచి వచ్చిన అందాల భామల మధ్య ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. మన దేశం తరఫున నందిని గుప్తా పాల్గొనడం గర్వకారణంగా మారింది.
India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్.. బార్డర్‌లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం
ఈ వేడుకకు వెయ్యి మందికి పైగా ప్రత్యేక అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలిలోని వేదికను అలంకరించడమే కాకుండా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పోటీలు టూరిజం, ఆతిథ్య రంగాలకు బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం పాకిస్తాన్ – భారత దేశాల మధ్య ఉద్రిక్తతల (India – Pakistan War) నేపథ్యంలో ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే సందేహాలు కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు యుద్ధం నడుస్తున్న సమయంలో పోటీలను వాయిదా వేయాలని సూచిస్తున్నాయి. అయినా ప్రభుత్వ సంకల్పం వల్ల, ఈ పోటీలు విజయవంతంగా పూర్తవుతాయని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.