BRS Party: ‘గులాబీల జెండలే రామక్క’ పాటని విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
'గులాబీల జెండలే రామక్క' అనే పాటను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రగతి భవన్లో విడుదల చేశారు.
- By Balu J Published Date - 11:21 AM, Sat - 14 October 23
BRS Party: చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను పాట రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించే ‘గులాబీల జెండలే రామక్క’ అనే పాటను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రగతి భవన్లో విడుదల చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉందని పాట పాడిన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయలను మంత్రులు అభినందించారు.
సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన మంచి పనులు అందరికి పాట రూపంలో అందచేయాలనే ఉద్దేశంతో ఈ పాటను పాడామని, మంత్రులు ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని గాయకురాల్లు తెలిపారు. తమ గానంతో ఆకట్టుకున్న కొమ్ము లక్షమ్మ బృందానికి మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరలను బహూకరించి సత్కరించారు.
ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్‌ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది… వందల కొద్ది లైక్‌లు, షేర్లతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యింది. ఇదివరకే విడుదలైన పాట ప్రోమోకు కూడా విశేష స్పందన లభించింది.
గులాబీల జెండలమ్మ…
గులాబీల జెండలమ్మ…
గులాబీల జెండలమ్మ…గులాబీల జెండలే రామక్క ..
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్కగానం: కొమ్ము లక్ష్మమ్మ
కోరస్: బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ.సంగీతం: కళ్యాణ్ కీస్ https://t.co/4rk1iZiAKI… pic.twitter.com/djuNdr89Dy
— BRS Party (@BRSparty) October 13, 2023
Tags
Related News
Harish Rao: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు
Harish Rao: పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లత�