Katamayya Raksha kits : గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్
Katamayya Raksha kits : తాటి చెట్లు ఎక్కే సమయంలో గీతా కార్మికుల భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన ‘కాటమయ్య రక్షక కవచ్ కిట్లు’ అందజేస్తున్నట్లు తెలిపారు.
- By Sudheer Published Date - 02:41 PM, Sat - 16 November 24

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి అన్ని కులాల వారికీ వరుసగా గుడ్ న్యూస్ లు అందిస్తూ వస్తుంది. తాజాగా గీత కార్మికులకు (Minister Ponnam Prabhakar good news for Gita workers) మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు..ఈ సందర్బంగా గీతా కార్మికులకు కీలక ప్రకటన చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో గీతా కార్మికుల భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన ‘కాటమయ్య రక్షక కవచ్ కిట్లు’ అందజేస్తున్నట్లు తెలిపారు. తాటి చెట్టు నుండి పడిపోవడం వల్ల గీతా కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ఆగేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అంతేకాక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వచ్చే ఏడాది మార్చ్ తర్వాత గీతా కార్మికులకు మోపెడులు (గీతలు తొక్కడానికి ఉపయోగించే పరికరాలు) అందజేస్తామని తెలిపారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయని, తాటి చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్లపై నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల నిధులతో కూడా సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also : Heroic Action : రైల్వేశాఖ హీరోయిక్ మిషన్.. జెట్ స్పీడుతో గమ్యస్థానానికి వరుడి కుటుంబం