KTR meet Amshala Swamy: ఫ్లోరైడ్ బాధితుడితో కేటీఆర్ భోజనం.. అండగా ఉంటానని హామీ!
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే దత్తత తీసుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:58 PM, Thu - 13 October 22

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే దత్తత తీసుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మునుగోడు ప్రచారంలో ఉన్న ఆయన ఫ్లోరైడ్ బాధితుడ్నిని కలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
భవిష్యత్ లోనూ అండగా ఉంటానని స్వామి కుటుంబానికి మంత్రులు భరోసా ఇచ్చారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మునుగోడుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు అందిస్తున్న విషయం తెలిసిందే.
మునుగోడు ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS, మంత్రి శ్రీ @jagadishTRS.. గతంలో స్వామికి ఇల్లు కట్టించి ఇచ్చిన మంత్రి కేటీఆర్. pic.twitter.com/h0BFCVxJyq
— BRS Party (@BRSparty) October 13, 2022