HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Minister Harish Rao Counter To Fm Nirmala Seetharaman On Modi Photo Issue

Harish Rao : `రేష‌న్ పై బొమ్మ‌` ఇష్యూలో నిర్మ‌ల‌కు హ‌రీశ్ కౌంట‌ర్‌

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య `ఫ్లెక్సీ` ర‌చ్చ రేగింది. రేష‌న్ షాపు వ‌ద్ద `మోడీ ఫ్లెక్సీ` పెట్ట‌లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతామ‌న్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

  • By CS Rao Updated On - 04:31 PM, Fri - 2 September 22
Harish Rao : `రేష‌న్ పై బొమ్మ‌` ఇష్యూలో నిర్మ‌ల‌కు హ‌రీశ్ కౌంట‌ర్‌

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య `ఫ్లెక్సీ` ర‌చ్చ రేగింది. రేష‌న్ షాపు వ‌ద్ద `మోడీ ఫ్లెక్సీ` పెట్ట‌లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతామ‌న్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. రేష‌న్ బియ్యం స‌ర‌ఫ‌రాలో కేంద్రం వాటా గురించి క‌లెక్ట‌ర్ చెప్ప‌లేక‌పోవ‌డంతో ఆమె మ‌రింత ఆగ్ర‌హించారు. అర‌గంట‌లో కేంద్రం వాటా ఎంతో వివ‌రంగా చెప్పాల‌ని హుకుం జారీ చేశారు. అంతేకాదు, మోడీ ప్లెక్సీని సాయంత్రంలోపు రేష‌న్ దుకాణం వ‌ద్ద పెట్టాల‌ని డెడ్ లైన్ పెట్టారు. దీంతో ఆ స‌న్నివేశం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయింది.

ప్ర‌తిగా తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు రంగంలోకి దిగారు. దేశాన్ని సాకుతోన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌ట‌ని నిర్మ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. సుమారు రూ. 3.65ల‌క్ష‌ల కోట్ల‌ను దేశానికి తెలంగాణ ఇస్తోంద‌ని లెక్క తీశారు. అందుకే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ఫ్లెక్సీల‌ను పెట్టాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల‌కు హిత‌వు ప‌లికారు. దీంతో రేష‌న్ బియ్యంలో ఫ్లెక్సీల ప్ర‌చారం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. రేష‌న్ షాపుల వ‌ద్ద మోడీ ఫ్లెక్సీని పెట్ట‌మ‌న‌డం ఆయ‌న్ను త‌గ్గించ‌డ‌మేన‌ని మంత్రి హ‌రీశ్ అన్నారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా కేసీఆర్ ప్లెక్సీలు పెడితే, తెలంగాణ‌లో మోడీ ఫోటోల‌ను రేష‌న్ షాపుల వ‌ద్ద పెడ‌తామ‌ని కౌంటర్ ఇచ్చారు హరీశ్ రావు.

పేదలకు పంపిణీ చేసే బియ్యం కోసం కేంద్రం 30 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 రూపాయలు జ‌త‌చేస్తోంది. అందుకే, మోడీ ఫోటోల‌ను రేష‌న్ షాపుల వ‌ద్ద పెట్టాల‌ని నిర్మ‌ల డిమాండ్ చేశారు. అంతకుముందు బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

మొత్తం మీద కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలంగాణ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ రాద్ధాంతం దిశ‌గా వెళుతోంది. ప్ర‌చారం కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీప‌డ‌డంతో మ‌రోసారి రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైయింది.

Tags  

  • finance minister harish rao
  • nirmala sitharaman
  • pm modi
  • ration rice

Related News

Election Survey : మ‌ళ్లీ భార‌త్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోట‌ర్ స‌ర్వే

Election Survey : మ‌ళ్లీ భార‌త్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోట‌ర్ స‌ర్వే

ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది? అనే ప్ర‌శ్న‌ల‌కు

  • PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!

    PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!

  • Anil Antony: కాంగ్రెస్‌‌లో పదవులకు ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా

    Anil Antony: కాంగ్రెస్‌‌లో పదవులకు ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా

  • Maha Governor: ఇంక రాజకీయాలు చాలు.. రాజీనామా చేస్తున్నా: మహా గవర్నర్

    Maha Governor: ఇంక రాజకీయాలు చాలు.. రాజీనామా చేస్తున్నా: మహా గవర్నర్

  • Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!

    Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!

Latest News

  • Nalgonda Politics: కోవర్ట్ కోమటిరెడ్డి.. నల్లగొండలో పోస్టర్ల కలకలం

  • Gautam Adani: టాప్-10 బిలియనీర్ల జాబితా నుంచి గౌతమ్ అదానీ ఔట్

  • Dasara Teaser: నాని దసరా టీజర్ ను చూశారా!

  • Fevers : హైదరాబాద్‌ని వ‌ణికిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్స్‌.. ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్న న‌గ‌ర‌వాసులు

  • Vistara Airlines: ఎయిర్ విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: