Mastan Sai : మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 499 అశ్లీల వీడియోలు
Mastan Sai : మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌ను పరిశీలించిన పోలీసులు అందులో 499 అశ్లీల వీడియోలు, 2500కి పైగా అమ్మాయిల ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు
- By Sudheer Published Date - 11:54 AM, Sun - 23 February 25

విజయవాడకు చెందిన యువతిని వేధించిన కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి (Mastan Sai) కేసు విషయంలో రోజుకొక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నార్సింగి పోలీసులు అతడిని విచారించగా హార్డ్‌డిస్క్, డ్రగ్స్, పార్టీల గురించి సంచలన విషయాలు వెలుగు చూశాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌ను పరిశీలించిన పోలీసులు అందులో 499 అశ్లీల వీడియోలు, 2500కి పైగా అమ్మాయిల ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 17 ఫోల్డర్లుగా వీటిని భద్రపరిచాడని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా బాధిత యువతి ఫోన్ నుంచి క్విక్ షేర్ ద్వారా 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెల్లడైంది.
SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్.. రేవంత్‌కు రాహుల్ ఫోన్‌కాల్
పోలీసుల విచారణలో ఆరుగురు అమ్మాయిల వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మస్తాన్ సాయి తన గర్ల్‌ఫ్రెండ్స్, భార్య, ఇతర యువతులతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను హార్డ్‌డిస్క్‌లో భద్రపరిచాడని తెలుస్తోంది. వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్, గదిలో సీక్రెట్‌గా తీసిన వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతులు తెలుసుకోకుండా వీడియోలను రహస్యంగా రికార్డు చేసిన విషయాన్ని మస్తాన్ సాయి అంగీకరించాడు. అంతేకాకుండా అతని హార్డ్‌డిస్క్‌లో మరెవరి ఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
YSRCP: వైసీపీకి మరో షాక్.. మరో నేత అరెస్ట్
డ్రగ్స్ మాఫియా పార్టీలు, సప్లయర్ల గురించి పోలీసులు ప్రశ్నించినా, మస్తాన్ సాయి పూర్తిగా సహకరించకుండా మౌనం పాటిస్తున్నాడు. గతంలో అతనిపై రెండు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఎవరెవరికి సరఫరా చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అతడు నిరాకరిస్తున్నాడు. అయితే హార్డ్‌డిస్క్‌లో ఉన్న డ్రగ్స్ పార్టీల వీడియోలు, వాటిలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మొత్తం ఘటనపై పోలీసులు గొప్ప ఎత్తుగడతో మరిన్ని ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.