Marri Shashidhar Reddy: బీజేపీ గూటికి మర్రి శశిధర్ రెడ్డి.. చేరికకు రంగం సిద్ధం!
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్,
- By Balu J Published Date - 02:32 PM, Thu - 24 November 22
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, మరి కొందరు సీనియర్ నేతలు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 25న కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇచ్చిన అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్ర నేతలు వివరించే చాన్స్ ఉంది.
ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బీజేపీ శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ నేతలకు వివరించనున్నారు. ఇతర పార్టీల నేతల చేరికలపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు జాతీయ నేతలను ఆహ్వానించే విషయంపై కూడా హైకమాండ్ తో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Related News
Kishan Reddy: తెలంగాణలో 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని రాష్ట్ర బీజేపీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర