KTR Counter Bandi: బీజేపీ బాబులు.. ఈ లవంగాన్ని ఇలాగే వదిలేయకండి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధినేత బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- By Balu J Published Date - 03:06 PM, Sun - 9 October 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధినేత బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫాం హౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కేటీఆర్ తన ట్విటర్ లో “బీజేపీ బాబులూ.. ఈ ‘లవంగం’ వదలొద్దు.. త్వరలో పిచ్చి పట్టిన తర్వాత ప్రజలను తిడతాడంటూ ట్వీట్ చేశాడు. బండి సంజయ్ మాటలు సమాజానికి ప్రమాదకరం అని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్‌ను వెంటనే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించాలని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ కోరారు. అటు బండి కామెంట్స్, ఇటు కేటీఆర్ కౌంటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.
పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు
ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి https://t.co/bCucYw6PM6
— KTR (@KTRBRS) October 8, 2022