HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Visited Journalist Shankar And Made Harsh Comments On Revanth Sarkar

KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు

  • Author : Balu J Date : 25-02-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Revanth
Ktr Revanth

KTR: గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన ఇతర పార్టీల నేతలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందన్నారు.

భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్ పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు. శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన దాడికి తెగబడిందని ఆరోపించారు. శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం పక్షపాతం చూపించారన్నారు.

పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపిని కేటీఆర్ కోరారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంపైన అడ్డగోలుగా మాట్లాడినా, ప్రభుత్వంపైన అనేక అసత్య ప్రచారాలు చేసినా, పది సంవత్సరాలపాటు ప్రభుత్వంలో ఉన్న ఏనాడు కూడా భౌతిక దాడులకు పాల్పడలేదని కేటీఆర్ గుర్తు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • hard co
  • ktr
  • TCongress

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

  • KTR called Prabhas...

    KTR: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

Latest News

  • Nitin Gadkari: సమస్యలున్న ఒక్క వాహనాన్ని అయినా చూపించండి.. ఇథనాల్ వివాదంపై మౌనం వీడిన గడ్కరీ.. ప్రభుత్వ E20 విధానాన్ని సమర్థించారు

  • Hormuz crisis: హోర్ముజ్ జలసంధి మరోసారి అట్టుడికిపోతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • Pawan Kalyan: పవర్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd