Congress Ministers London Tour : రైతులు జైల్లో..లండన్ లో మంత్రుల జల్సాలు – కేటీఆర్
Congress Ministers London Tour : మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి..అంటూ బస్సు లో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల వీడియో
- By Sudheer Published Date - 11:41 AM, Wed - 13 November 24

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై ప్రజల్లో రోజు రోజుకు ఆగ్రహపు జ్వాలలు ఎగేసిపడుతున్నాయి. హామీల పేరుతో తమను మోసం చేసారని చెప్పి ఇప్పటికే ప్రజలు గగ్గోలు పెడుతుండగా..ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి వారిలో మరింత ఆగ్రహం నింపుతున్నారు. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన సంగతి తెలిసిందే. వికారాబాద్ లోని లగ్గిచెర్ల గ్రామంలో ఫార్మా కోసం భూముల విషయంలో మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై గ్రామస్థులు ఒక్కసారిగా రాళ్లు, బండరాళ్లతో దాడులకు పాల్పడ్డారు.ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావణం నెలకొంది.
ఈ ఘటన కు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి (Narendar Reddy)ని పోలీసులు హైదరబాద్ లోని.. కేబీఆర్ పార్కులో అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచబోతున్నారు. ఇదిలా ఉంటె లండన్ (Congress Ministers London Tour) లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైల్లో ఉండగా, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి..అంటూ బస్సు లో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల వీడియో ను షేర్ చేసారు కేటీఆర్. సీఎం మహారాష్ట్రలో, మంత్రి లండన్‌లో బిజీగా.ఓట్లు వేసి గెలిపించిన రైతులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.
While 16 Kodangal Farmers are in Jail and Former MLA Narendar Reddy Garu is arrested for protesting the Govt’s reckless land acquisition, watch what Mahbubnagar District Minister Jupalli and Congress MLAs are up to in London
CM is busy in Maharashtra and Minister in London.… pic.twitter.com/b5Aq1xYAOP
— KTR (@KTRBRS) November 13, 2024
Read Also : Matka Movie Team : మట్కా హిట్ కావాలంటూ దేవాలయాలను చుట్టేస్తున్న వరుణ్ తేజ్..