HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr To Borbanda Ibrahim Khans House Do You Know Why

KTR: బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్, ఎందుకో తెలుసా!

  • Author : Balu J Date : 07-01-2024 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

KTR: తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కి తన ట్వీట్ లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని అయితే ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆయన కోరారు! బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఖాన్ కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీంఖాన్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట మేరకు ఈరోజు కేటీఆర్ బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. దివ్యంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పించన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్ కి ఇబ్రహీం ఖాన్ కుటుంబం తెలియజేసింది.

ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో ఉన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్ద గుమికూడారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Dinner Invite
  • hyderabad
  • ktr

Related News

Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించ

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

  • KTR to undertake a state-wide padayatra next year.

    KTR: వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కేటీఆర్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd