Raithu Maha Dharna : ఆరోగ్య శ్రీ అంటే వైఎస్సార్.. రైతు బంధు అంటే కేసీఆర్ – కేటీఆర్
Raithu Maha Dharna : ఆరోగ్య శ్రీ అంటే వైస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ గుర్తులు లేకుండా ఉండేందుకు రైతుబంధును ఖతం చేయాలని ఈ సర్కారు భావిస్తోంది
- By Sudheer Published Date - 03:21 PM, Tue - 28 January 25

కెసిఆర్ పై కక్షతో కాంగ్రెస్ రైతుబంధుని ఆపేయాలని చూస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో ఆరోపించారు. ‘ఆరోగ్య శ్రీ అంటే వైస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ గుర్తులు లేకుండా ఉండేందుకు రైతుబంధును ఖతం చేయాలని ఈ సర్కారు భావిస్తోంది. ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లడిగేందుకు కాంగ్రెస్ వాళ్లు వస్తారు. వాళ్లను నిలదీయండి’ అని పిలుపునిచ్చారు.
Jasprit Bumrah: ఐసీసీ అవార్డుల్లో భారత్ హవా.. మేటి టెస్ట్ క్రికెటర్ గా బుమ్రా!
ఇక కాంగ్రెస్ పాలనలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) లో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఐటీ టవర్ కళ తప్పిందని విమర్శించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే.. తాను రైతు ధర్నాకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని అన్నారు. ఇదే సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకు సిగ్గుందా వెంకటరెడ్డీ? భూపాల్ రెడ్డిపై పోలీసులతో దాడి చేయిస్తావా? నీకు దమ్ముంటే నల్గొండ గడియారం సెంటర్కి రా. మాలాగే మీటింగ్ పెట్టు. ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు. ఉత్తమ్, వెంకటరెడ్డికి ఆకారాలు, అహంకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసిందేమీ లేదు’ అని విమర్శించారు.
ఆరోగ్యశ్రీ అంటే YSR గుర్తొస్తారు..రైతుబంధు అంటే KCR గుర్తొస్తారు KCR ఆనవాళ్లు చెరిపేద్దామని..రైతుబందు బంద్ చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నడు – కేటీఆర్ #ktr #YSR #BRSParty #kcr #TelanganaNews #HashtagU pic.twitter.com/j4hsLMv4n6
— Hashtag U (@HashtaguIn) January 28, 2025