TS : ప్రకాశ్ రాజా .. తొక్కా..అభివృద్ధి చేస్కున్నది మేం (కేటీ)రాములా..!!
సినీనటుడు ప్రకాశ్ రాజ్ దత్తత గ్రామంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రంగారెడ్డి జిల్లాల్లోని కొండారెడ్డిపల్లిలో మంచి డెవలప్ మెంట్ జరిగిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు
- Author : hashtagu
Date : 22-09-2022 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
సినీనటుడు ప్రకాశ్ రాజ్ దత్తత గ్రామంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రంగారెడ్డి జిల్లాల్లోని కొండారెడ్డిపల్లిలో మంచి డెవలప్ మెంట్ జరిగిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రకాశ్ రాజ్ కేవలం 2019 వరకు తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని…తర్వాతే గ్రామంలో డెవలప్ మెంట్ ఎక్కువ జరిగిందని పేర్కొన్నారు. 3ఏళ్లుగా సొంత నిధులతోనే తమ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. మా గ్రామాన్ని అభివృద్ధి మేము. నిధులు మావి…అంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే..మంత్రిగారేంటీ..ప్రకాశ్ రాజ్ ను ప్రశంసిండం అంటూ కొండారెడ్డిపల్లి గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామం మంచి డెవలప్ మెంట్ లో దూసుకుపోతోంది. మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతోపాటు రోడ్లను అందంగా నిర్మించుకున్నారు. అయితే ఈ ఫోటోలను ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ ను ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య సమన్వయంతో ఊరిని డెవలప్ చేసినట్లుగా అర్థంతో కేటీఆర్ ట్వీట్ చేశారు.
This is the village adopted by @prakashraaj
Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT
— KTR (@KTRBRS) September 20, 2022