HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Express Grief Over Fire Accident Occurred At Gulzar House

Fire Accident : అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి – కేటీఆర్ డిమాండ్

Fire Accident : అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు తక్కువగా ఉన్నాయని, కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు

  • Author : Sudheer Date : 19-05-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Comments Gulzar House F
Ktr Comments Gulzar House F

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్‌ (Gulzar House Fire Accident)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన నేపథ్యంలో, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంపై స్పందించిన కేటీఆర్, ఇలాంటి ఘటనలు మరలా జరగకూడదన్నదే ప్రభుత్వాల ధ్యేయంగా ఉండాలన్నారు. చార్మినార్ వంటి జన ప్రాంతాల్లో ఉన్న భద్రతా లోపాలను ప్రభుత్వం గమనించాలని కోరారు.

ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఘటన జరిగిన వెంటనే ఆయనే అక్కడికి వచ్చి ఉంటే సహాయక చర్యలు మరింత వేగంగా జరిగేవి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కంటే ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు తక్కువగా ఉన్నాయని, కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమయానికి ఫైర్ ఇంజిన్లకు నీరు లేకపోవడం, అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేని కారణంగా బాధితులు మరణించారని ఆరోపించారు.

Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు

ప్రమాదానికి కారణాలపై చేపట్టిన ప్రాథమిక విచారణలో ఏసీ పేలక, షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం ప్రారంభమైందని అధికారులు నిర్ధారించారు. చెక్క ప్యానెళ్లు, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం ఈ ఘోరానికి దారితీసిన ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. ఇల్లు పెద్దదైనప్పటికీ ఒక్కటే బయటకు వెళ్లే మార్గం ఉండటం, లోపల ఇరుగుపొరుగు ఉండటం వల్లే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువైందని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. ఈ విషాద ఘటనపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Gulzar House
  • KTR express grief over fire accident
  • revanth reddy

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Light A Lamp For God

    Fire Accident : దేవుడికి దీపం పెట్టడమే వారు చేసిన పాపమా ?

Latest News

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd