HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Directed The Assembly In Charges

KTR: అసెంబ్లీ ఇన్ చార్జిలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు.

  • Author : Balu J Date : 13-10-2023 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ktr-about-brs-candidates-list
ktr-about-brs-candidates-list

KTR: భారత రాష్ట్ర సమితి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకుగాను పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్చార్జిలుగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. పార్టీ ఇన్చార్జిలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వీరికి దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ నియమించిన అసెంబ్లీల ఇన్చార్జిలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బిఅర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బిఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బిఅర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు.

ఈ రోజు అసెంబ్లీల వారీగా ఇన్చార్జీలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత వీరి పైననే ఉంటుందని, రేపటి నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పార్టీ ఇంచార్జ్ లకు పలు సలహాలు, సూచనలు అందించారు.

రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఇన్చార్జిలుగా కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో గత పది సంవత్సరాల లో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు . ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపిన హరీష్ రావు ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs candidates
  • hyderabad
  • ktr
  • Telangana 2023 Elections

Related News

Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించ

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

  • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

  • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

  • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

  • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd