KTR Challenge : రేవంత్ కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని కేటీఆర్ సవాల్
KTR Challenge : తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే వాటి పర్యవసానాలు తప్పవని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు
- By Sudheer Published Date - 08:22 PM, Thu - 17 July 25

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీలో చిట్‌చాట్ పేరుతో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ కేసు(Drug case)లో తనపై విచారణ జరుగుతుందని రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించిన కేటీఆర్, “నాపై ఏ కేసు ఉంది? ఏ ఆధారం ఉంది?” అంటూ ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇచ్చి తాను సంయమనం పాటించానని, కానీ ఇకపై తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు.
Pakistan Floods : పాకిస్థాన్‌లో తుపానుల బీభత్సం.. 124కి చేరిన మృతుల సంఖ్య
చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే తన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. లేదంటే తాను చేసిన వ్యాఖ్యలు చిల్లర రాజకీయంగా మిగిలిపోతాయని విమర్శించారు. ఢిల్లీ వరకు వెళ్లి తనపై బురద జల్లడం రేవంత్ దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరుతో వ్యక్తిత్వ హననం చేయడాన్ని తాను ఇకనూ సహించనని హెచ్చరించారు.
తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే వాటి పర్యవసానాలు తప్పవని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలూ లేకుండా ఆరోపణలు చేయడం అనైతికమని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు నాయకుల మధ్య ఇలాంటి విమర్శలు, ఆరోపణలు మళ్లీ వాతావరణాన్ని ఉద్రిక్తం చేస్తున్నాయి.