KTR:బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బ్రదర్…అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..!!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు.
- By Hashtag U Published Date - 01:19 PM, Sat - 2 April 22

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమస్యలపై స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరు బ్యాగ్ లను సర్దుకుని హైదరాబాద్ కు వచ్చేయండి అని ఆఫర్ ఇచ్చారు. డిజిటల్ బుక్ కీపింగ్ స్టార్టప్ అయిన ఖాతాబుక్(Khatabook)ఫౌండర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీష్ నరేష్ మార్చి 30న ఓ ట్వీట్ చేశారు. బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కోరమంగళలో స్టార్టప్ లు బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నాయి. అయినా అక్కడ రోడ్లు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్ కోతలు తప్పడం లేదంటూ ట్వీట్ చేశాడు. క్వాలిటీ వాటర్ సప్లై…ఉపయోగించలేని ఫుట్ పాత్ లు ఉన్నాయన్నారు.
భారత్ లోని సిలికాన్ వ్యాలీ కంటే ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు మెరుగైన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి…పీక్ ట్రాఫిక్ లో సమీపంలోని ఎయిర్ పోర్టుకు మూడు గంటల సమయం పడుతుందని మరో స్టార్టప్ ఫౌండర్ సేతు APIకి చెందిన నిఖిల్ కుమార్ తన అభిప్రాయాలను తెలిపారు. నేను ప్రయాణం చేస్తున్నా..బెంగుళూరు ఏ విధంగా మారింది..దయచేసి గమనించండి..సార్. మీరు దీన్ని సరిద్ధిద్దకపోయినట్లయితే..సామూహిక వలస వెళ్తారని కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరు బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ కు రండి…ఇక్కడ మేం అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మా ఎయిర్ పోర్టు అత్యుత్తమైంది. త్వరగా నగారానికి రావడం, వెళ్లడం సులభం అవుతుంది. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం దృష్టి 3 i మంత్రపై ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.