HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Announced Two International Projects For Hyderabad

KTR: హైదరాబాద్ కు రెండు అంతర్జాతీయ ప్రాజెక్టులు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)లు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి.

  • Author : Balu J Date : 22-02-2023 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Ktr

రెండు అంతర్జాతీయ సంస్థలు… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)లు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని, వీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ ప్రాజెక్టు కూడా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెలంగాణలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గ్లాండ్ ఫార్మా, డాక్టర్ సైరస్ పూనావల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించాయి.

ఫిబ్రవరి 24 నుండి 26 వరకు బయోఏషియా 20వ ఎడిషన్ ఇండస్ట్రీ ఈవెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత బయోఏషియా సమావేశాల వల్ల రాష్ట్రం రూ. 25,000 కోట్ల పెట్టుబడులను సాధించిందని, ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు జరిగాయని కేటీఆర్ తెలిపారు. స్విట్జర్లాండ్, నార్వే, థాయ్‌లాండ్, కొరియా, అర్జెంటీనా, స్పెయిన్, యుకె, జర్మనీ, దక్షిణాఫ్రికా తదితర దేశాల పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బయోఏషియా సమావేశాల్లో నోబెల్ గ్రహీతలు, లాస్కర్ అవార్డు విజేతలు, బ్రేక్‌త్రూ ప్రైజ్ విజేతలు కూడా పాల్గొంటారు. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై పరిశోధనకు చేసినందుకు గాను ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నారు. ఈవెంట్‌లో 175 మంది ఎగ్జిబిటర్లు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో స్టార్టప్‌ల కోసం ‘ఇన్నోవేటివ్ జోన్’ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం కోసం 400 నామినేషన్లు అందాయి. వాటిలో 75 షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ktr
  • telangana
  • WHO

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd