HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Announced Govt Job To Pravalika Brother

KTR On Pravalika Suicide : ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం – కేటీఆర్ ప్రకటన

ప్రవళిక ఆత్మహత్యపై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈరోజు ప్రవళిక కుటుంబం తనను కలిసిందని… వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చినట్లు

  • Author : Sudheer Date : 18-10-2023 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Govt Job To Pravalika Broth
Govt Job To Pravalika Broth

వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య (Pravalika Suicide) చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-2 (Group 2 Exams) పరీక్షలు వాయిదా వేయటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని.. విద్యార్థి సంఘం నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం అధికార పార్టీ (BRS)కి తలనొప్పిగా మారింది. ఇదే క్రమంలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు సైతం బిఆర్ఎస్ ఫై మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. రెండు రోజులుగా పలు విద్యార్థి సంఘాలు , ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul) సైతం ప్రవళిక కుటుంబాన్ని కలవబోతున్నారనే వార్తలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసాయి. ఈ క్రమంలో కేటీఆర్ కీలక హామీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రవళిక ఆత్మహత్యపై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈరోజు ప్రవళిక కుటుంబం తనను కలిసిందని… వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చినట్లు తెలిపారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం (ktr Announce Govt Job to Pravalika Brother) ఇస్తామని చెప్పాం. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు బీజేపీవాళ్లు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ల మాటలను నమ్మవద్దు. 9 ఏళ్లలో 2 లక్షల 20 వేల ఉద్యోగాలకు భర్తీకి శ్రీకారం చుట్టాం. లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. మిగతా ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. అవసరమైతే కమిషన్ ను కూడా ప్రక్షాళన చేస్తాం. యువతకు న్యాయం చేస్తాం. మా మీద విశ్వాసం ఉంచండి. మరోసారి అధికారం ఇవ్వండి” అని మంత్రి కేటీఆర్ కోరారు.

మరోపక్క ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు శివరాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి వేధింపుల వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక ఆత్మహత్యతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి.13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్‌తో పాటు మరికొంత మంది కేసులు నమోదు చేశారు.

Read Also : Centre approves 4% Hike in DA : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించిన మోడీ సర్కార్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • group 2 exams postponed
  • ktr
  • KTR Announce Govt Job To Pravalika Brother
  • Pravallika suicide

Related News

Ktr Ponguleti Kmm

Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (ప్రజా ప్రభుత్వం) పేదల పక్షాన ఉంటుందని, రాజకీయ డ్రామాలకు తావులేకుండా బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతామని పొంగులేటి భరోసా ఇచ్చారు

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

Latest News

  • యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

  • Dubai : దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి ..ఏమవుతుందో అని పార్టీ శ్రేణుల్లో భయం !!

  • Garikapati : తెలంగాణలో ఉంటూ ఏపీకి సలహాలివ్వొద్దు – గరికపాటికి కమలానంద కౌంటర్

  • భగ్గుమన్న చమురు ధరలు.. భారత్‌పై భారమెంతో తెలుసా..?

  • Free Bus Men in Telangana : మగవారికి ఉచిత బస్సు ప్రయాణం – తెలంగాణ సర్కార్ ఉత్తర్వూలు జారీ

Trending News

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd