HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr And Harish Rao Goes To Delhi Meet To Kavitha

KTR and Harish Rao : ఢిల్లీకి కేటీఆర్‌, హరీష్ రావు

  • Author : Kavya Krishna Date : 17-03-2024 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Party KTR And Harish
Ktr And Harish

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్ (KTR), హరీష్‌ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వీరు కవితతో భేటీ కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కలిసి కుట్ర చేశాయని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌ (Anil), పీఆర్‌వో రాజేష్‌ (PRO Rajesh), ముగ్గురు సహాయకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ సమాచారాన్ని ఈడీ రోస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించింది. కవిత నివాసంలో నిన్న జరిగిన సోదాల్లో కవిత, ఆమె భర్త అనిల్ మొబైల్ ఫోన్లు, పీఆర్‌వో రాజేష్ కు సంబంధించిన రెండు ఫోన్లు, ముగ్గురు అసిస్టెంట్ల ఫోన్లు మొత్తం పది ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిని సేకరించేందుకు ఢిల్లీకి రావాలని వారికి సమాచారం అందించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసి ఈరోజు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 23 వరకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. కవిత భర్తతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేయడం ఈ కేసులో కీలక పరిణామం.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉంటారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను శనివారం హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించగా, ఈడీ తరపున ఎన్‌కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కవితకు 7 రోజుల రిమాండ్ విధించింది.
Read Also : Narendra Modi : నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi Liquor scam
  • enforcement directorate
  • harish rao
  • ktr
  • MLC Kavitha

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd