Komatireddy Venkat Reddy : కేంద్రమంత్రి బండి సంజయ్ తో మంత్రి కోమటిరెడ్డి భేటీ
ఢిల్లీ లోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి.. బండి సంజయ్‌ను కలిసి అభినందనలు తెలిపారు
- Author : Sudheer
Date : 24-06-2024 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ ను.. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ లోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి.. బండి సంజయ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. సోమవారం పార్లమెంట్‌లో కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా బండి అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..ఆదివాసీ ప్రాంతాలలో రోడ్లు నిర్మించాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని ఆమె ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి కోరడం జరిగింది. అలాగే తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాలన్నారు. పీఎంజీఎస్ వైలో కనెక్టివిటీ లేని 1270 ఆవాసాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని, రోడ్డు మార్గం లేని 164 కు పైగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also : Nitish Kumar Reddy: టీమిండియాలో మరో తెలుగుతేజం.. ఐపీఎల్ మెరుపులతో నితీశ్ కు ఛాన్స్