Rajagopal : యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Rajagopal : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మనసున్న మనిషి అని నిరూపించారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్ (26) కిడ్నీ వ్యాధితో తీవ్రమైన ఇబ్బందులు
- By Sudheer Published Date - 06:03 PM, Sun - 2 November 25
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మనసున్న మనిషి అని నిరూపించారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్ (26) కిడ్నీ వ్యాధితో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. వైద్యులు కిడ్నీ మార్పిడి తప్ప మరే మార్గమూ లేదని తేల్చారు. కానీ ఆపరేషన్ ఖర్చు సుమారు 12.5 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడంతో, కూలీ కుటుంబానికి అది అసాధ్యమైంది. తన కుమారుని ప్రాణం కాపాడే మార్గం లేక తల్లిదండ్రులు ఆవేదనతో రోజులు గడుపుతుండగా, ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా రాజగోపాల్ రెడ్డి దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించి, తక్షణమే ఆసుపత్రికి తన సిబ్బందిని పంపించి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించారు.
IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?
తన సొంత నిధులతోనే రూ. 12.50 లక్షలు చెల్లించి కామినేని ఆసుపత్రిలో నెల్లి గణేష్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం ద్వారా లేదా దాతృత్వ సంస్థల సహాయంతో సహకారం అందిస్తారు, కానీ రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత డబ్బుతో యువకుడి ప్రాణాన్ని కాపాడటం విశేషం. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక, ఆయన స్వయంగా ఆసుపత్రికి వెళ్లి గణేష్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. “నేనున్నాను… మీరు ధైర్యంగా ఉండండి” అంటూ గణేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కృతజ్ఞతతో గణేష్ తల్లిదండ్రులు ఆయన పాదాలకు వంగి నమస్కరించి, “మా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించారండి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సంఘటన మునుగోడు ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి గారి పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. ఆయన చూపిన ఉదారత, మానవతా విలువలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. రాజకీయ పరంగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న ప్రజా ప్రతినిధిగా ఆయన పేరు మునుగోడులో మారుమ్రోగుతోంది. గణేష్ ప్రాణం రక్షించేందుకు చేసిన ఈ సేవను ప్రజలు “కార్పొరేట్ వైద్యానికి మానవతా ముద్ర”గా ప్రశంసిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారి సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని గణేష్ కుటుంబం చెబుతుండగా, నియోజకవర్గ ప్రజలు “మా ఎమ్మెల్యే నిజమైన మనుష్యుడు” అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.