Kishan Reddy Meet Pawan Kalyan : తెలంగాణ ఎన్నికల్లో పవన్ సపోర్ట్ కోరిన బీజేపీ నేతలు
పవన్ కళ్యాణ్ ను బిజెపి నేతలు కిషన్ రెడ్డి , లక్ష్మణ్ లు కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో బిజెపి కి సపోర్ట్ చేయాలనీ కోరారు
- Author : Sudheer
Date : 18-10-2023 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఆలా బయటకు వస్తే చాలు లక్షలాదిమంది ఆయనతో అడుగులేస్తారు. ప్రస్తుతం ఇటు సినిమాలు (Movies) , అటు రాజకీయాలతో (Politics) బిజీ గా ఉన్నారు. ఇప్పటీకే ఏపీలో వరుస యాత్రలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) సమీపిస్తున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈసారి జనసేన కూడా బరిలో దిగబోతుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ తో తెలంగాణ జనసేన నేతలు (Telangana Janasena Leaders) సమావేశమై పోటీ చేయాలనీ సూచించారు. 2018లో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీ చేసేందుకు పట్టుబట్టలేమని.. అలాగే మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా పోటీ నుంచి విరమించుకున్నామని.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం తప్పనిసరిగా పోటీచేయాల్సిందేనని ముక్త కంఠంతో కోరారు. దీనిపై అలోచించి నిర్ణయం తీసుకుంటానని పవన్ వారికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను బిజెపి నేతలు కిషన్ రెడ్డి (Kishan Reddy) , లక్ష్మణ్ లు కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో బిజెపి (BJP) కి సపోర్ట్ చేయాలనీ కోరారు . కానీ పవన్ వారికీ జనసేన నేతలు తెలిపిన సూచనలు తెలియజేసారు. 2014లో ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గెలుపుకోసం కృషి చేశామని.. అలాగే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ నుంచి విరమించుకున్నామని.. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని వారికీ తెలియజేసారు. మరి ఫైనల్ గా పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో..బిజెపి కి సపోర్ట్ చేస్తారా..? లేక ఎన్నికల బరిలో పోటీ చేస్తారా అనేది చూడాలి.
Read Also : IPL Team – Congress Manifesto : ఆ పార్టీ మేనిఫెస్టోలో ‘ఐపీఎల్ టీమ్’ హామీ.. !