Kishan Reddy : బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట – కిషన్ రెడ్డి
బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ తానే పెడతానంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు
- By Sudheer Published Date - 07:35 PM, Thu - 5 October 23

కేంద్ర మంత్రి , తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) మరోసారి బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణ లో వేలకోట్ల అభివృద్ధి పనులకు మోడీ వస్తే..కనీసం ప్రోటోకాల్ ప్రకారం కలవడం చేతకాదు కానీ..మోడీ వస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారా..? అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహాంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ తానే పెడతానంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయని వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరు పెట్టి తెలంగాణ సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన 50 ఎకరాలకు క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. యూనివర్సిటీకి భూమి కోసం వెంటపడి, వెంటపడి ఉత్తరాలు రాశానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
Read Also : World Cup 2023: మెగా టోర్నీకి క్యూ కట్టిన స్పాన్సర్లు