HYD: హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక చర్యలు
HYD : ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయి
- By Sudheer Published Date - 09:44 AM, Thu - 16 January 25

ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) నగరం ఎంతో అభివృద్ధి చెందింది..ఇప్పుడు మరింతగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ (Revanth Govt) కీలక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయి. ఈ నేపధ్యంలో రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా “ఫోర్త్ సిటీ” పేరుతో ఒక కొత్త ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఫోర్త్ సిటీకి చుట్టూ కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పడటానికి సర్కార్ శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రేవెన్యూ అధికారులు ఇప్పటికే భూముల వివరాలు సేకరించడం ప్రారంభించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఆరు మండలాల్లో ఈ పరిశ్రమలు స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి స్థానిక స్థలాలను పరిశీలిస్తున్నారు.
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ పై దాడి
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఆపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు శంషాబాద్ మండలంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, టెక్స్‌టైల్ పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతాలలో ఐటీ, పరిశ్రమల హబ్‌లు, విద్యా సంస్థలు, గేమింగ్ జోన్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే నాలుగైదేళ్లలో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఘట్‌కేసర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం మండలాల్లో ప్రభుత్వ భూములను సేకరించడం ప్రారంభించారు. ఒక్కో ప్రాంతంలో కనీసం 1000 ఎకరాలు సేకరించాలని టార్గెట్ పెట్టారు. ఈ భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో అభివృద్ధి చేస్తే, అక్కడ ఉద్యోగులు, కార్మికులు నివాసముండే సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసం కేటాయించడం, వాటి సమీపంలో ఉద్యోగుల నివాసం కోసం అవసరమైన భూములు సిద్ధం చేయడం వంటి అంశాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయడానికి సర్కార్ కృషి చేస్తోంది. ఇది హైదరాబాద్ నగరానికి మరింత పెరుగుదలని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని తెచ్చిపెడుతుందని అంత భావిస్తున్నారు.