Fire Accident : కేసముద్రం రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. రెస్ట్ కోచ్ దగ్ధం
Fire Accident : కారిమనగర్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో గురువారం అర్ధరాత్రి తీవ్ర గందరగోళానికి కారణమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
- By Kavya Krishna Published Date - 02:27 PM, Fri - 8 August 25
Fire Accident : కారిమనగర్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో గురువారం అర్ధరాత్రి తీవ్ర గందరగోళానికి కారణమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఓ రెస్ట్ కోచ్ (విశ్రాంతి కోచ్) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఈ ఘటన, రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన రేపింది. మంటలు ఒక్కసారిగా ఉధృతమవడం, పొగలు వ్యాపించడంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. అప్పటికి ఆ రెస్ట్ కోచ్ లో నలుగురు రైల్వే ఉద్యోగులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు వెంటనే అప్రమత్తమై, తలుపులు తెరిచి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది.
Varalakshmi Vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా?
ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం భాదితులతో పాటు స్థానికులను ఊరటకు గురి చేసింది. అగ్నిప్రమాదానికి గల సరిగ్గా కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అంటుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రైల్వే శాఖ ఈ ఘటనపై అంతర్గత విచారణ మొదలుపెట్టింది. ఈ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు రేకెత్తించింది.
S ** Consent : లైంగిక సమ్మతికి ఏజ్ ను ఫిక్స్ చేసిన కేంద్రం