Raja Singh: తెలంగాణలోనూ ‘మహారాష్ట్ర’ సీన్ రిపీట్
మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వం
- Author : Balu J
Date : 22-07-2022 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలోనే తలెత్తుతాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ జోస్యం చెప్పారు. చేతనైతే ప్రభుత్వ పతనాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం గైర్హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే బిజీగా ఉంటూ ప్రధానిని సీఎం కలవడం లేదని ఆరోపించారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం అందించిన వరద సాయంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.