CM KCR: యాదాద్రికి కేసీఆర్.. కొత్త పార్టీ కోసం ప్రత్యేక పూజలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సీఎం కేసీఆర్ శుక్రవారం దర్శించుకున్నారు.
- By Hashtag U Published Date - 05:44 PM, Fri - 30 September 22

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సీఎం కేసీఆర్ శుక్రవారం దర్శించుకున్నారు. పూజారులు సీఎం దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 1 కిలో 16 తులాల బంగారాన్ని తన మనువడు హిమాన్షుతో కలిసి సమర్పించారు. పూజ కార్యక్రమాల తర్వాత యాదగిరిగుట్ట కొండపై నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కాగా కొత్త పార్టీ పేరుపై ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణ వ్రత మండపం, గండి చెరువు ఆధునికీకరించే పనులు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.
Live: CM Sri KCR visit to #Yadadri Temple https://t.co/jKzJjsRlji
— Telangana CMO (@TelanganaCMO) September 30, 2022