HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr To Avoid Meeting Pm Modi Again

KCR to avoid PM: ఈసారి కూడా కలిసేది లేదు…ప్రధాని టూర్‌కు కేసీఆర్ డుమ్మా..?

రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం...ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది.

  • Author : Hashtag U Date : 25-05-2022 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR and Modi
KCR and Modi

రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం…ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది. ఎడమొహం పెడ మొహం అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు ఉండటంతో…వీటి మధ్య మరింత దూరం పెరుగుతోంది. ఈ నెల 26వ తేదీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలుకుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని హోదాలో మోదీ గతంలో హైదారబాద్ పర్యటనకు వచ్చారు. అప్పుడు కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలకలేదు. కేసీఆర్ డుమ్మా కొట్టడంపై రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ముచ్చింతల్ లో సమతామూర్తివిగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి కేసీఆర్ కనీస మార్యదకూడా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఈనెల 26న గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్యఅతిథిగా రానున్నారు.

అయితే అదే కేసీఆర్ బెంగుళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతోపాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి కూడా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని అధికారుల్లో చర్చ జరుగుతుంది. ఈ పర్యటన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరింత వైరం పెరిగే అవకాశం ఉండే అవకాశం లేకపోలేదు.

కాగా రాష్ట్రానికి అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనే సీఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మోదీ టూర్ కు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై మోదీకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. మొత్తానికి మే 26న కేసీఆర్ హైదరాబాద్ లో ఉంటారా? బెంగుళూరు వెళ్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • KCR to avoid
  • MOdi hyderabad tour
  • pm modi
  • state vs centre
  • telangana politics
  • TRS vs BJP

Related News

Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్‌బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొ

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

  • KTR to undertake a state-wide padayatra next year.

    KTR: వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కేటీఆర్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd