Eatala Grand Offer: ఈటెలకు డిప్యూటీ సీఎం ఆఫర్? `గ్రాండ్ ఘర్ వాపసీ`!
తెలంగాణ బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. గ్రాండ్ ఘర్ వాపసీకి ఆయన తెరలేపారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీకి చెందిన శ్రవణ్ కుమార్ ను టీఆర్ఎస్ ఆకర్షించింది. రాబోవు రోజుల్లో ఈటెల రాజేంద్ర తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని గులాబీ వర్గాల్లోని టాక్.
- Author : CS Rao
Date : 15-11-2022 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. గ్రాండ్ ఘర్ వాపసీకి ఆయన తెరలేపారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీకి చెందిన శ్రవణ్ కుమార్ ను టీఆర్ఎస్ ఆకర్షించింది. రాబోవు రోజుల్లో ఈటెల రాజేంద్ర తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని గులాబీ వర్గాల్లోని టాక్. డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేయడం ద్వారా ఆయన్ను కేసీఆర్ ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.
మునుగోడులో రెండు ప్లేస్ కు వచ్చిన బీజేపీ దక్షిణ తెలంగాణలోనూ బలంగా ఉన్నామని సంకేతాలు ఇస్తోంది. ఇంకో వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోంది. ఎప్పుడు ఎవరు బీజేపీలోకి వెళతారో తెలియని ఆందోళన గులాబీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి గందరగోళానికి తెరదింపడానికి కేసీఆర్ సరికొత్త బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లిన వాళ్లను ఎలాగైనా తిరిగి తీసుకోవడమే ఆ బ్లూ ప్రింట్ లక్ష్యం. ఉద్యమంలో కీలకంగా ఉన్న వాళ్లను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీని బలహీనపరచాలని భావిస్తున్నారు.
Also Read: TS/BJP : హస్తినకు ఈటెల, కోమటిరెడ్డి… అమిత్ షాతో భేటీ.!!
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రను టీఆర్ఎస్ తిరిగి తీసుకోగలిగితే, దాదాపుగా బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా బలహీనపడినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఆ విషయం బీజేపీ వరకు కూడా చేరింది. ఒక బిజెపి నాయకుడు మాట్లాడుతూ, “ఆఫర్‌లు వస్తున్నాయని మాకు తెలుసు, కాని రాజేందర్ ఎందుకు వెనక్కి వెళ్తారో మేము ఆలోచించలేము. తిరిగితే అతని పరువు ఏం మిగులుతుంది? ఈరోజు కేసీఆర్, టీఆర్‌ఎస్‌తో పోరాడుతున్నందున ఆయనపై ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు.హుజూరాబాద్‌కు ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా టీఆర్‌ఎస్ మా నేతల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసిందని, కానీ బీజేపీ నేతలు రాజకీయంగా కానీ, ఇతరత్రా ప్రలోభాలకు లొంగరని చెప్పారు.
“మునుగోడు అనైతిక పోరులో గెలిచిన టిఆర్‌ఎస్ తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఈటెల అంటున్నారు. బీజేపీలో ఎదగకుండా, పార్టీలో బలపడకుండా చేసేందుకు ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారని ఆయన వివరిస్తున్నారు. రాజేందర్ ఖండిస్తున్నప్పటికీ, గ్రాండ్ ‘ఘర్ వాప్సీ` బీజేపీ మీద గులాబీ బాస్ ప్రయోగించాలని చూస్తున్నారు. బీజేపీలోకి వెళ్లిన టీఆర్ఎస్ లీడర్ల ఎంత మంది తిరిగి కేసీఆర్ పక్షాన చేరతారో చూడాలి.
Also Read: KCR Munugodu Formula: 2023 ఎన్నికలపై కేసీఆర్ ‘మునుగోడు’ ఫార్ములా!