HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr New Gift To The People Of Telangana 3 Lakhs To Land Owners

KCR New Year Gift: తెలంగాణ ల్యాండ్ ఓనర్స్ కు ‘కేసీఆర్’ న్యూయర్ కానుక!

మునుగోడు ఉప ఎన్నిక అందించిన విజయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు.

  • Author : Balu J Date : 22-11-2022 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

మునుగోడు ఉప ఎన్నిక అందించిన విజయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ యజమానులకు (సొంత జాగాలు) 3 లక్షలు మంజూరుచేసేందుకు సిద్ధమవుతోంది.  తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకం అమలుకానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ శాఖ, వివిధ అనుబంధ శాఖలు పథకం పర్యవేక్షణ విభాగంతో పాటు మార్గదర్శకాల తయారీ ప్రక్రియను ప్రారంభించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ఈ పథకాన్ని ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోంది.

డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌ల పంపిణీ సందర్భంగా ప్లాట్‌ హోల్డర్‌లకు సొంత ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. గతేడాది ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించినా అది అమలు కాకపోవడంతో ప్రస్తుతం రూ. 5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3000 మంది లబ్ధిదారులను గుర్తించి, వారికి రూ.3 లక్షల సాయం అందించాలని యోచిస్తోంది.

సంక్షేమ శాఖ ప్రకారం.. ఈ పథకం ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా అమలుకాబోతోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉండడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే టీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆసరా పింఛన్‌, దళితుల బంధు పథకంతో పాటు సొంత ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం అందించే పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందుతారని అధికార పార్టీ నాయకులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • new year
  • telangana
  • TS CMO

Related News

We will contest in Telangana — Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Latest News

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd