KCR Before : ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు లేనట్టే!ముందస్తుకు `గుత్తా` పరోక్ష సంకేతం!
తెలంగాణ అసెంబ్లీ రద్దు(KCR Before) అంశం జోరుగా సాగుతోంది.
- Author : CS Rao
Date : 20-01-2023 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ రద్దు(KCR Before) అంశం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని విపక్షాల విశ్వాసం. గత ఎన్నికల(Elections) సందర్భంగా కూడా ప్రత్యర్థులు మేల్కొనేలోపు కేసీఆర్ ఎన్నికలను ముగించారు. ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీని ఆయన ప్లే చేస్తారని విపక్షాల అనుమానం. కాంగ్రెస్ పార్టీ బలపడకముందే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారట. కానీ, ఫిబ్రవరిలో మాత్రం అసెంబ్లీ రద్దు ఉండదని బీఆర్ఎస్ లీడర్ల వాదన. ఎందుకంటే, జనవరి 31 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మార్చిలోపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ రద్దు అనేది విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు.
అసెంబ్లీ రద్దు ఏ క్షణమైనా ..(KCR Before)
అంటే, గుత్తా చెబుతున్న దాని ప్రకారం మార్చి తరువాత అసెంబ్లీ రద్దు(KCR Before) ఏ క్షణమైనా ఉండే ఛాన్స్ ఉంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ముహూర్తం పెట్టినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికలను(Elections) కొట్టివేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన కేవలం బడ్జెట్ సమావేశాల గురించి మాత్రమే మీడియా ముందు ప్రస్తావించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ముందస్తుకు వెళ్లడానికి అవకాశం ఉందని అర్థమవుతోంది. చాలా కాలంగా ముందస్తు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రపతి పాలన అనే అంశం కూడా తెర మీదకు వస్తోంది.
Also Read : KCR Khammam:గ్రూప్ లకు చెక్!కూకట్ పల్లికి పువ్వాడ,ఖమ్మం బాస్ గా తుమ్మల?
గత ఎన్నికల సందర్భంగా (2018) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండేది. రాజకీయంగా మోడీ, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం చూశాం. అందుకే, ఆనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటికీ వెంటనే ఎన్నికలను నిర్వహించారు. ఈసారి ఆ విధంగా కేంద్రం రియాక్ట్ అవుతుందా? అనే సందేహం బీఆర్ ఎస్ వర్గాల్లో ఉంది. ఒక వేళ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత రాష్ట్రపతి పాలన పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. అపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కేసీఆర్ కోల్పోతారు. అప్పుడు గవర్నర్ బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
గవర్నర్, సీఎం మధ్య గ్యాప్
ప్రస్తుం గవర్నర్, సీఎం మధ్య గ్యాప్ ఉంది. కేంద్ర స్థాయిలో వాళ్లిద్దరి మధ్యా ప్రచ్ఛన్నయుద్ధం వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై గవర్నర్ తమిళ సై ఎప్పటికప్పుడు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని కేసీఆర్ సర్కార్ ఇవ్వడంలేదు. ప్రతిగా ఆరు బిల్లులను గవర్నర్ ఆపారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ అంగీకరించాలి. అందుకు భిన్నంగా తమిళ సై వ్యవహారం ఉందని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ అసెంబ్లీని రద్దు చేస్తే వెంటనే ఎన్నికలు వస్తాయన్న నమ్మకం లేదు.
Also Read : Amit Shah to Telangana: మిషన్ తెలంగాణ షురూ.. ఈనెల 28న రాష్ట్రానికి అమిత్ షా
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కు ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అప్పుడు అనివార్యంగా ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని బీఆర్ఎస్ వ్యూహమని చెబుతున్నారు. అంతేకాదు, ఒక వేళ అవసరమైతే, ఏపీ అసెంబ్లీని కూడా రద్దు చేయిచండం ద్వారా జగన్మోహన్ రెడ్డిని కలుపుకుని ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లోని వినికిడి. ఇలా, పలు విధాలుగా తెలంగాణ ప్రభుత్వ రద్దుపై చర్చ జరుగుతుండగా ముందస్తు ఖాయమనే సంకేతాలు `గుత్తా` ఇవ్వడం గమనార్హం. అయితే, ఫిబ్రవరిలో మాత్రం అసెంబ్లీ రద్దు ఉండదని చెప్పట్టడం ముందస్తు సంకేతాలను ఇస్తోంది.