KCR BRS: ఏకవాక్యంతో బిఆర్ఎస్ ఆవిర్భావం, టీఆర్ఎస్ క్లోజ్
'భారత్ రాష్ట్ర సమితి (ఆంగ్లం:Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ
- By CS Rao Published Date - 01:48 PM, Wed - 5 October 22

‘భారత్ రాష్ట్ర సమితి (ఆంగ్లం:Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును 2022 అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది.’ ఇలా ఏకావాక్య తీర్మానంతో బిఆర్ఎస్ ఆవిర్భవించింది. సరిగ్గా 1.19 నిమిషాలు ముహూర్తానికి ప్రకటించారు.
ఉదయం 11.45 నిమిషాలకు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పార్టీ పేరు మార్పు ప్రతిపాదన చేశారు. సర్వసభ్య సమావేశానికి హాజరు అయిన 283 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నిరాడంబరంగా జరిగింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు లోని చిదంబరం నుంచి ఒక ఎంపీ హాజరయ్యారు. మిగిలిన రాష్ట్రాల నుంచి రైతు నాయకులు హాజరు అయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల చీఫ్ లను ఆహ్వానించి నప్పటికి వాళ్ళు రాలేదు.

5fd58af3 1f17 4185 8980 5c9f778e297a
దీంతో నిరాడంబరంగా బిఆర్ఎస్ అవిర్భభించింది. తెలుగు మీడియాను పూర్తిగా ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టారు. సాయంత్రం 4 గంటలకు ప్రెస్మీట్ కేసీఆర్ పెట్టనున్నారు.

81690806 348e 40b1 Baf2 A1333fc9f8c3
ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు బిఆర్ఎస్ ఆవిర్భావ సందడి టీఆర్ఎస్ ఆఫీస్ ల్లో కనిపించింది. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. దసరా రోజు ముహూర్తం ప్రకారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బిఆర్ఎస్ ను కేసీఆర్ స్థాపించారు.