Kavitha: సీబీఐ అరెస్ట్ పై కోర్టులో కవిత పిటిషన్
- Author : Latha Suma
Date : 11-04-2024 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
K Kavitha: తీహార్ జై(Tihar Jai)ల్లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. సీబీఐ(CBI) తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు. కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. రేపు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
Read Also:EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి పెంపు!
కాగా, కవితను గత నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది.